వేడ్ దూకుడు... టీమిండియా ముందు భారీ లక్ష్యాన్నుంచిన ఆసీస్

నాగపూర్ లో ఓవర్లు కుదించిన రెండో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. మైదానం చిత్తడిగా ఉండడంతో ఈ మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించగా, టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. 

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మాథ్యూ వేడ్ తన ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి దూకుడుగా ఆడాడు. వేడ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

అంతకుముందు, కెప్టెన్ ఆరోన్ ఫించ్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 31 పరుగులు చేశాడు. ఓపెనర్ కామెరాన్ గ్రీన్ 5, మ్యాక్స్ వెల్ 0, టిమ్ డేవిడ్ 2, స్టీవ్ స్మిత్ 8 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 2, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు.

Team India
Australia
2nd T20
Nagpur

More Telugu News